Youmobs

Priyanka Mohan: లిప్ లాక్ సీన్స్ పై ప్రియాంక ఏమందంటే?

ప్రియాంక అరుళ్ చాలా సాంప్రదాయంగా కనిపించే హీరోయిన్. ఇప్పటి వరకు పెద్దగా రొమాంటికి సీన్లు కానీ, లిప్ లాక్ సీన్లు కానీ చేయలేదు, తాజాగా వాటిపై స్పందించింది.

 

Priyanka Mohan: ప్రియాంక అరుల్ మోహన్ ప్రస్తుతం బిజీ హీరోయిన్‌గా ఉంది. తాజాగా విడుదలైన కెప్టెన్ మిల్లర్ విజయం సాధించడంతో హీరోయిన్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తుంది. ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ అడ్వెంచర్ తమిళనాడులో మంచి ప్రదర్శన కనబరుస్తోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరోయిన్ ప్రియాంక మోహన్‌ను తెరపై ముద్దు సన్నివేశాలు చేస్తావా అని అడిగారు. ఆమె నుండి ఊహించిన విధమైన ఆన్సర్ వచ్చింది. స్క్రిప్ట్ డిమాండ్ చేసినా సరే నేను చేయను అని తేల్చి చెప్పేసింది.

చదవండి:Chiranjeevi: చిరంజీవికి విలన్‌గా తమిళ స్టార్ హీరో?

ప్రియాంక మోహన్ ఇప్పటి వరకు చాలా సినిమాల్లో నటించింది. కానీ.. ఎందులోనూ గ్లామర్ గా కనిపించడం, లిప్ లాక్ సీన్స్, టూమచ్ రొమాన్స్ లాంటి సీన్లు ఎప్పుడూ చేయలేదు. అలాంటివాటికి ఆమె దూరంగా ఉంటుందని అందరికీ తెలుసు. సూర్య ఎతర్క్కుమ్ తునింధవన్ (2022) , శివ కార్తికేయన్ డాన్ (2022) వంటి చిత్రాలలో బబ్లీ గా నటించి అందరినీ ఆకట్టుకుంది. నాని గ్యాంగ్ లీడర్‌లో తెలుగులోకి అడుగుపెట్టిన తర్వాత, ఆమె శర్వానంద్ సరసన శ్రీకారంలో నటించింది. ప్రస్తుతం బిగ్గీస్, సరిపోదా శనివారం పై చాలా ఆశలు పెట్టుకుంది. అలాగే పవన్ కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా OG చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Exit mobile version