Youmobs

https://hittvtelugu.com/movies/varada-rajamannar-5-minutes-lip-lock-which-has-become-a-hot-topic-105158.html

పృధ్వీరాజ్ సుకుమారన్ అంటే గుర్తుపట్టడం కాస్త కష్టం గానీ.. అదే సలార్‌లో వరద రాజమన్నార్ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు తెలుగు జనాలు. అయితే.. లేటెస్ట్‌గా వరద రాజమన్నార్ లిప్ లాక్ ఒకటి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.

Varada Rajamannar: హాట్ టాపిక్‌గా మారిన ‘వరద రాజమన్నార్’ 5 నిమిషాల లిప్ లాక్?

Varada Rajamannar: ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ సినిమాలో ప్రభాస్‌కు ధీటుగా వరద రాజమన్నార్ పాత్రలో అదరగొట్టేశాడు పృధ్వీరాజ్. అయితే.. మళయాళంలో స్టార్ హీరోగా దూసుకుపోతున్న పృధ్వీ.. ప్రస్తుతం ది గోట్ లైఫ్ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. ఆడు జీవితం టైటిల్‌తో తెలుగులో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా.. మలయాళం అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ ‘గోట్‌లైఫ్’ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో అమలాపాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే.. ఈ మూవీలో పృథ్వీరాజ్‌సుకుమారన్‌, అమలాపాల్ మధ్య లిప్‌లాక్ సీన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో ఏకంగా ఐదు నిమిషాల కంటే ఎక్కువ నిడివితో లిప్‌లాక్ సీన్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మామూలుగా అయితే కొన్ని సినిమాల్లో ఒకటి రెండు నిమిషాల పాటు లిప్ లాక్ సీన్లు ఉంటాయి.

చదవండి:Samantha: షాకింగ్.. దానికోసం సమంతకు పది కోట్లా?

కానీ ఇప్పుడు మాత్రం గోట్ లైఫ్‌లో 5 మినిట్స్ లిప్ లాక్ అనేసరికి.. ఇదే రికార్డ్ బ్రేకింగ్ లిప్ లాక్ అని అంటున్నారు. మరి ఈ లిప్ లాక్ ఎలా ఉంటుందో చూడాలి అంటే.. మార్చి 28 వరకు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటికే సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తున్న పృధ్వీ.. మార్చి 22 నుండి 24 వరకు హైదరాబాద్, బెంగుళూరులో సినిమాను ప్రమోట్ చేయనున్నారు. రెండు గంటల నలభై ఒక్క నిమిషం నిడివితో గోట్‌లైఫ్ తెలుగులో రిలీజ్ కానుంది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీకి సెన్సార్ నుంచి యూ/ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. మరి ఈ సినిమాతో పృధ్వీ ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

Exit mobile version